హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేట మార్కెట్‌లో పత్తికి రికార్డు ధర

WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం పత్తికి సీజన్‌లోనే గరిష్ఠ ధర పలికింది. ముత్తోజిపేట రైతు కాకి జంపయ్య తెచ్చిన నాలుగు బస్తాల పత్తి కోసం వ్యాపారులు పోటీపడగా క్వింటాకు రూ.9,120 ధర ఖరారైంది. సీసీఐ మద్దతు ధర రూ.8,667 కంటే ఇది రూ.453 ఎక్కువ. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర అని యార్డుకు వచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేశారు.