హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సరఫరా మెరుగుదలకు అభివృద్ధి పనులు: SE

WGL: సర్కిల్‌లో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు TGNPDCL వరంగల్ SE ఆనందం తెలిపారు. రెండున్నరేళ్లలో రెండు కొత్త సబ్‌స్టేషన్లు, మూడు అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. రెండు పవర్, 167 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతో పాటు మరో 178 DTRలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.