WGL: ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 14 మందిని మేజిస్ట్రేట్ అంకేశ్వరపు కమలాకర్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.9,700 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ కే. సుజాత తెలిపారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మరో ఇద్దరికి రూ.1,300 జరిమానా విధించినట్లు వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.
తెలంగాణ
డ్రంకెన్ డ్రైవ్‌లో 14 మందికి జరిమానా


