జగిత్యాల జిల్లా పెంబట్లకు చెందిన రైతు బండారి విజయ కేంద్ర ప్రభుత్వ మహిళా కిసాన్ దివస్ అవార్డుకు ఎంపికయ్యారు. అక్టోబర్ 15న ఆమెకు ఈ పురస్కారం అందజేయనున్నారు. ఎకరం భూమిలో 14 రకాల కూరగాయలు సాగు చేస్తూ, సేంద్రియ పద్ధతులను అవలంబిస్తున్న విజయ ప్రతిభను గుర్తించిన అధికారులు ఆమె పేరును జాతీయ అవార్డుకు సిఫారసు చేశారు.
తెలంగాణ
జగిత్యాల రైతుకు జాతీయ అవార్డు


