హైదరాబాద్: 28°C
తెలంగాణ

భగత్‌నగర్‌ ఓపెన్‌ జిమ్‌లో ఇబ్బందులు

KNR: నగరంలోని పలు ప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ ప్లాట్‌ఫాంలకు అతికించిన రబ్బరు షీట్లు వర్షాలకు ఊడిపోతున్నాయి. తిరిగి అతికించినా నిలవడం లేదని స్థానికులు చెబుతున్నారు. భగత్‌నగర్‌ రోడ్డు నంబర్‌ 3లోని ఓపెన్‌ జిమ్‌కు వచ్చే వారు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.