హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి మళ్లించాలి'

PDPL: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి మళ్లించాలని ధర్మారం ఎంఏఓ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. సాగునీరు, విద్యుత్ కొరత, భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో రబీ సీజన్లో రైతులు 90 రోజుల్లోపు వచ్చే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కూరగాయలు, పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు పండించాలని పేర్కొన్నారు.