WGL: వరంగల్ బ్యాంకు కాలనీకి చెందిన విశ్రాంత మున్సిపల్ అధికారి కోలిపాక వెంకటస్వామి (75)పై దాడి చేసి మృతికి కారణమైన కేర్‌టేకర్ నిట్ట రాంబాబును మట్టెవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు సిఐ కరుణాకర్ తెలిపారు. సెప్టెంబరు 1న మద్యం మత్తులో రాంబాబు వెంకటస్వామిపై రాగి కడియంతో దాడి చేయగా, చికిత్స పొందుతూ ఈ నెల 9న ఆయన మృతి చెందినట్లు తెలిపారు.
తెలంగాణ
వృద్ధుడి మృతికి కారణమైన కేర్‌టేకర్ అరెస్టు


