హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.5 కోట్లు మంజూరైనా వంతెన పనులకు మోక్షమెప్పుడు?

PDPL: చొప్పదండి ప్రధాన మార్గంలోని జూలపల్లి మండల కేంద్రంలో హుస్సేన్మియా వాగుపై వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరై ఏడాదిన్నర గడిచినా పనులు ప్రారంభం కాలేదు. భారీ వర్షాలు కురిసినప్పుడు వాగు నీరు లోలెవెల్‌ కల్వర్టుపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెన నిర్మాణం చేపడితే వాహనదారుల సమస్యలు తీరనున్నాయి.