JGL: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈనెల 14న ఉదయం 9 గంటలకు వ్యవసాయశాఖ, ఆత్మ ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.భాస్కర్ తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. మేళాలో వివిధ రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పొలాసలో ఈనెల 14న కిసాన్ మేళా


