హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ ఢీకొని వ్యక్తి మృతి.. కేసు నమోదు

NRPT: మాగనూరు మండలం నల్లగట్టు మారెమ్మ ఆలయ దర్శనం అనంతరం శక్తినగర్‌కు నడుచుకుంటూ వెళ్తున్న యంకప్పను కృష్ణ మండలం గుడెబల్లూర్ శివారులో వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడి కుమారుడు పరుశురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.