హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీజీలో 74 శాతం సీట్లు భర్తీ

NRPT: పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజ్‌లో TG-CPGET-2026 ప్రవేశాలు సాగుతున్నాయి. మొత్తం 640 సీట్లకు 628 సీట్లు కేటాయించగా ఇప్పటి వరకు 474 మంది విద్యార్థులు చేరడంతో 74% అడ్మిషన్లు పూర్తయ్యాయని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 1, 2 విడతల కౌన్సెలింగ్ పూర్తి కాగా, 3వ విడత కౌన్సెలింగ్ ఈనెల 14 నుంచి 17 వరకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.