JGL: మెట్‌పల్లి పట్టణ శివారులోని ఇబ్రహీంపట్నం మలుపు వద్ద మైనార్టీ గురుకుల పాఠశాల సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ వద్ద మిషన్ భగీరథ నీరు లీకేజీ అవుతోంది. నెలల తరబడి వేలాది లీటర్ల నీరు వృథాగా మురుగు కాలువలో కలుస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
లీకేజీతో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు


