BHNG: భూదాన్ పోచంపల్లి లోనివెంకటరమణ కాలనీ ప్రధాన సీసీ రోడ్డును మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల కోసం తవ్వి, అనంతరం మట్టితో పూడ్చి వదిలేశారు. మట్టిని సరిగా చదును చేయకపోవడంతో గుంతలు ఏర్పడి రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డును తిరిగి సీసీతో పునర్నిర్మించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
సీసీ రోడ్డును తవ్వి మట్టితో పూడ్చివేత..!


