హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీప్తి జీవంజీకి ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేయాలి

WGL: పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు కీర్తి తెచ్చిన పారా అథ్లెట్ దీప్తి జీవంజీకి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు గాడిపెల్లి ప్రశాంత్ కోరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అవసరమైన పత్రాలు, అర్హతల పరిశీలన పూర్తి చేసి ఆమెకు తగిన గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.