హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండుతున్న వరి.. రైతుల ఆవేదన

NRPT: గుండుమాల్ మండల కేంద్రంలో వర్షాభావం, భూగర్భ జలాలు అడుగంటడంతో వరి పంటలు ఎండిపోతున్నాయి. మూడు ఎకరాల్లో సాగు చేసిన పంటకు నీరందక నష్టపోతున్నామని రైతులు గొల్ల నీలయ్య, రఘు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు వేసినా నీరు రాక పెట్టుబడి, శ్రమ వృథా అయ్యాయని, పంటను పశువులకు మేతగా వేయాల్సి వస్తోందని కన్నీరుమున్నీరయ్యారు.