MHBD: అప్రకటిత విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యతో పంటలకు నీరందడం లేదని నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు సోమవారం కేసముద్రం మండలం బేరువాడ గ్రామ పరిధిలోని రంగాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై క్రాంతికిరణ్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై బిఆర్ఎస్ ధర్నా


