ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీ భవిష్యత్తులో కార్పొరేషన్‌గా మారుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఖానాపూర్‌లో యూఏడీఎఫ్ నిధులతో రూ.10 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులను ఛైర్‌పర్సన్ అనూషతో కలిసి సోమవారం ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధికి అందరం కలిసి కృషి చేయాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
త్వరలో కార్పొరేషన్‌గా ఆదిలాబాద్: ఎమ్మెల్యే


