హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రీ దేవి అలంకరణలో అడెల్లి పోచమ్మ

NRML: సారంగపూర్ మండలం ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని గాయత్రిదేవిగా అలంకరించి కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.