హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు కానిస్టేబుల్‌పై దాడి.. యువకుడి అరెస్టు

BHPL: విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన తూముల గణేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ సోమవారం తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఘర్షణ జరుగుతుండగా అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ మహేశ్‌పై గణేశ్ దాడి చేసి విధులకు ఆటంకం కలిగించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.