హైదరాబాద్: 28°C
తెలంగాణ

21 నుంచి పోలీస్ అమరవీరుల వారోత్సవాలు

​PDPL: ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో ఓపెన్ హౌస్, వ్యాసరచన, ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలతో పాటు రక్తదాన శిబిరాలు, యువత సైకిల్ ర్యాలీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలను సైతం పరామర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.