ADB: ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని సాంస్కృతిక పాటలకు అనుగుణంగా నృత్యం చేసి సందడి చేశారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమని కలెక్టర్ కొనియాడారు. త్వరలో అర్హులైన మహిళలకు నూతన బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బతుకమ్మ సంబురాల్లో పాల్గొని నృత్యం చేసిన కలెక్టర్


