హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా తర్వాత పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు..!

BHNG: రైతులకు కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కసరత్తు వేగవంతం చేసింది. జిల్లాలో దసరా పండుగ తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి జిన్నింగ్ మిల్లుల వారీగా కేటగిరీల విధానాన్ని తొలగించి, అన్ని మిల్లుల్లోనూ ఒకేసారి కేంద్రాలను ప్రారంభిస్తుండటం రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది.