హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్‌లో ఆశ్రమ పాఠశాల బాలికలకు పతకాలు

MLG: ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో సోమవారం వాజేడు మండలం పెదగొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. అక్షర ట్రయథ్లాన్‌-ఏ విభాగంలో స్వర్ణం, హర్షిణి లాంగ్‌జంప్‌లో రజతం, హర్షిత ట్రయథ్లాన్‌-బి విభాగంలో కాంస్య పతకం సాధించారు. ప్రధానోపాధ్యాయుడు కేశవరావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.