హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా భవన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

PDPL: రామగుండం కార్పొరేషన్ లోని 41వ డివిజన్ లో మహిళా భవన్ నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సూర్య, జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఎల్బినగర్ లో ఖాళీగా ఉన్న స్థలంలో మహిళా భవన్ నిర్మిస్తే మహిళలు, స్వయం సహాయక సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.