హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడు మండలాల్లో తాగునీటికి అంతరాయం

BHNG: తుర్కపల్లి జంక్షన్ వద్ద ఉన్న 700 మి.మీ. డీఐ పైప్ లైన్ మరమ్మతుల కారణంగా అక్టోబర్ 13,14 తేదీల్లో గోదావరి నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. దీంతో ఆలేరు మండలంలోని 13 ఆవాసాలతో పాటు ఆత్మకూరు, భువనగిరి, మోటకొండూరు, యాదగిరిగుట్ట, గుండాల, తుర్కపల్లి మండలాల్లోని మొత్తం 103 ఆవాసాలకు నీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందన్నారు.