హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 కిలోల గంజాయితో ఇద్దరు మహిళల అరెస్టు

WGL: గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం శివనగర్‌కు చెందిన కోరిడి లక్ష్మి, బేగరి శాంతి ఆంధ్రప్రదేశ్‌లోని దారకొండ వద్ద రూ.10 లక్షల విలువైన 20 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేశారు.పుణేకు చెందిన వ్యక్తికి విక్రయించేందుకు గంజాయిని తరలిస్తుండగా ఏడుమోరీల వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టు పడినట్లు సిఐ కరుణాకర్ తెలిపారు.