హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైపూర్ STPP యూనిట్-2లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

MNCL: జైపూర్ మండలం సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో యూనిట్-2లో తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్లాంట్ జీఎం సూర్యనారాయణ రాజు ప్రకటనలో తెలిపారు. విద్యుత్ కేంద్రంలోని యూనిట్-2 శనివారం ట్యూబ్ లీకేజ్ వల్ల షట్ డౌన్ కాగా, యుద్ధ ప్రాతిపదికనా మరమ్మతు పనులు పూర్తి చేసి సోమవారం రాత్రి తిరిగి విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.