హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐ ఆవరణలో ఈనెల 14న మినీ జాబ్ మేళా

MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఈనెల 14న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికిష్ణ తెలిపారు. లాలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 150 ఖాళీలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 14న ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో ఆసక్తిగల అభ్యర్థులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.