హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం..

JN: రైలు పట్టాలు దాటుతుండగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని కొండపర్తి సాంబయ్య (55) మృతి చెందారు. సోమవారం కాజీపేట వరంగల్‌ రైల్వేస్టేషన్ల మధ్య పాత రైల్వేగేట్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం శివునిపల్లికి చెందిన సాంబయ్య వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి సమీపంలో నివసిస్తున్నారు. ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.