హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ASF: జైనూర్ మండలంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు MRO అడా బిర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.