హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలోనే తొలి మానవ రహిత సబ్‌స్టేషన్‌ ప్రారంభం

HYD: నగరంలో తొలి మానవ రహిత సబ్‌స్టేషన్‌ను చార్మినార్‌ డివిజన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో సోమవారం ప్రారంభించారు. రూ.14.38 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సాంకేతికంగా ఛార్జింగ్‌ చేసి అందుబాటులోకి తెచ్చినట్లు చీఫ్‌ ఇంజినీర్‌ ఎన్‌.లీలావతి తెలిపారు. ఎనిమిది 11 కేవీ ఫీడర్ల ద్వారా విద్యుత్‌ సరఫరా అందించనున్నట్లు పేర్కొన్నారు.