హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

RR: జిల్లా జల్పల్లి న్యూబాబానగర్‌లో సోమవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్య అజ్మీరా (30)పై అనుమానంతో భర్త ముస్తఫా (35) కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపారు. ముగ్గురు పిల్లల ఎదుటే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు, సెల్‌ఫోన్‌ను ఇంట్లో వదిలి పరారయ్యాడు. పోలీసులు అప్రమత్తం చేయడంతో పోలీసులు శ్రీశైలం మార్గంలో అదుపులోకి తీసుకున్నారు.