హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహిత అదృశ్యం.. తల్లి ఫిర్యాదు..!

WNP: బిజినేపల్లి మండలం సాల్కర్‌పేటకు చెందిన మైకాల గాయత్రి (24) అదృశ్యమైనట్లు తల్లి చెన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 8న వనపర్తిలో వెండి పట్టీలు కొనుగోలు చేసి, బస్టాండ్‌ నుంచి ఘన్‌పూర్ వెళ్లే బస్సు ఎక్కిన గాయత్రి ఇంటికి చేరుకోలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి వనపర్తి టౌన్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు.