NLG: తిప్పర్తి పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని పి. ప్రణిత అండర్-19 బాలికల కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 13, 14 తేదీల్లో సంగారెడ్డిలో జరిగే పోటీల్లో నల్గొండ జిల్లా తరఫున పాల్గొననుంది. ప్రణితను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహ నాయక్, ఫిజికల్ డైరెక్టర్ నిమ్మల లెనిన్ బాబు సోమవారం పాఠశాలలో అభినందించారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రణిత ఎంపిక


