హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు

MDK: రాయలపూర్ రైతు వేదికలో సర్పంచ్ గట్టు సుశీల అధ్యక్షతన రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రజినీ కుమారి పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాస్త్రవేత్తలు ఎల్‌నివో ప్రభావం, రబీ సాగు ప్రణాళికలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. ఏఈఓ సాయికృష్ణ, సర్పంచ్ సునీల్, పలువురు రైతులు హాజరయ్యారు.