HYD: చిలకలగూడలోని ఆలూగడ్డబావి హనుమాన్ దేవాలయం సమీపంలో ఈ నెల 3న అపస్మారక స్థితిలో కనిపించిన 30–35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు చిలకలగూడ పోలీసులను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి


