WNP: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సునిత రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 10 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భార్యాభర్తల వివాదం ఒకటి, భూ తగాదాలు రెండు, పరస్పర గొడవలు ఏడు ఉన్నాయి. ఫిర్యాదులపై వేగంగా స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ


