GDWL: అలంపూర్‌లో వెలసిన బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ దేవిని పాలమూరు ఎంపీ డీకే అరుణ సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో దీప్తి ఆమెను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామి, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రథోత్సవంలో ఎంపీ పాల్గొన్నారు.
తెలంగాణ
జోగులాంబను దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ


