హైదరాబాద్: 28°C
వార్తలు

డీఎస్సీ షార్ట్‌ నోటిఫికేషన్‌ నేడు?

AP: కూటమి ప్రభుత్వం ఇవాళ మరో DSC షార్ట్ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ప్రకటన వెలువరించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. పాఠశాల విద్య, సంక్షేమ శాఖలలో కలిపి 2,700కు పైగా పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండనుంది. మొదట షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చి, 3 వారాల తర్వాత పూర్తి సమాచారంతో మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.