హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏటీఎంలో లక్షల చోరీపై విచారణ..!

KMR: గాంధారి ఎస్‌బీఐ ఏటీఎంలో రూ. 25.45 లక్షల చోరీపై విచారణ కొనసాగుతోందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ముగ్గురు వ్యక్తులు బ్లాక్ స్కార్పియోలో వచ్చి కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లారన్నారు. అలారం పనిచేయకపోవడంతో చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని, భద్రత పెంచి పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని తెలిపారు.