హైదరాబాద్: 28°C
వార్తలు

సింగూరు నీటిని తాగు నీటికే కేటాయించాలి: ఎమ్మెల్యే

TG: రాష్ట్రంలో రైతులు సాగునీరు, విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్, మంత్రులు ఢిల్లీ పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. రైతుల అవసరాల కంటే లిక్కర్ కంపెనీలకు నీళ్లు ఇవ్వడంపైనే ప్రభుత్వానికి శ్రద్ధ ఎక్కువైందని ఆరోపించారు. సింగూరు నీటిని తాగు, సాగునీటి అవసరాలకే కేటాయించాలని డిమాండ్ చేశారు.