ఈ ఏడాది పండుగ సీజన్ ఈ-కామర్స్ అమ్మకాలు మందకొడిగా ప్రారంభమయ్యాయి. స్మార్ట్‌ఫోన్ల విడిభాగాల ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. డేటమ్ ఇంటెలిజెన్స్ ప్రకారం అక్టోబర్ 7-10 మధ్య అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు రూ.29,800–30,900 కోట్లకు పరిమితమయ్యాయి. ఫోన్ల విక్రయాల వాటా 35% నుంచి 30%కి పడిపోగా, టైర్-2 నగరాల్లో ఫ్యాషన్ అమ్మకాలు 22–25% పెరిగాయి.
వార్తలు
10 శాతం క్షీణించిన పండుగ సీజన్ అమ్మకాలు


