హైదరాబాద్: 28°C
వార్తలు

నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని కృష్ణ ఘాటి సెక్టార్‌ వద్ద లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు సరిహద్దుల (LoC) ద్వారా భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భారత సైన్యం అమర్చిన మందుపాతర పేలడంతో కమాండర్ మహమ్మద్ ఫైజాన్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన తర్వాత అధికారులు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.