హైదరాబాద్: 28°C
వార్తలు

కార్యకర్తలకు రూ.5 లక్షల బీమా: కాటసాని

KRNL: కల్లూరు అర్బన్‌లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ గుర్తింపు కార్డులను కాటసాని సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్డు ద్వారా రూ.5 లక్షల బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు.