హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌ తరఫున సుప్రీంలో పిటిషన్‌

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఇండియా కూటమి రాహుల్ గాంధీ నేతృత్వంలో 'మార్చ్ ఫర్ డెమోక్రసీ' ర్యాలీ చేపట్టింది. ఓటు చోరీపై సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ దాఖలు చేసేందుకు బయల్దేరిన విపక్ష ఎంపీలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సీఈసీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ నిరసనను మరింత ఉధృతం చేశాయి.