హైదరాబాద్: 28°C
వార్తలు

వీడీసీలపై చర్యలు తప్పవు: DSP

ఆదిలాబాద్ పరిధిలోని వీడీసీలు చట్టపరిధిలోనే పనిచేయాలని, బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని DSP జీవన్ రెడ్డి సోమవారం హెచ్చరించారు. గత ఏడాది కాలంలో ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించి 13 కేసుల్లో 47 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.