హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

BDK: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 9:30 గంటలకు చర్ల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.