హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలకు అవగాహన సదస్సు

KNR: యువతులు సామాజిక మాధ్యమాలు, అంతర్జాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని చైల్డ్ హెల్ప్‌లైన్–1098 జిల్లా సమన్వయకర్త ఆవుల సంపత్ యాదవ్ సూచించారు. సోమవారం కరీంనగర్ బ్యాంక్ కాలనీలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో యువతులు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యమిస్తూ, శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు.