హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుబీర్‌లో పత్తి కొనుగోళ్లు షురూ!

NRML: కుబీర్ మండల కేంద్రంలోని నాగేశ్వర్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సోమవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులు క్వింటాకు రూ.9,500 డిమాండ్ చేయగా, యాజమాన్య ప్రతినిధులు రేడిశెట్టి సంతోష్, ఆనంద్ క్వింటాకు రూ.9,101 చెల్లిస్తామని ప్రకటించారు. రైతు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని సంతోష్ అన్నారు. ఇకపై మార్కెట్ ధరల ప్రకారం రోజూ కొనుగోళ్లు ఉంటాయన్నారు.