హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులపై నమ్మకం పెంచాలి: ఎస్పీ

ADB: పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆయన 29 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూవివాదాలపై వచ్చిన బాధితులతో మాట్లాడి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.